మేరీ కోమ్: BBC Indian Sportswoman of the Year నామినీ

మేరీ కోమ్ లాంటి బాక్సర్ మరొకరు లేరు, ఉండరు. మరో మేరీని తయారు చేయడం కష్టం"- ఆరుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన 'పద్మవిభూషణ్' మేరీ కోమ్‌తో మాట్లాడుతుంటే మీకు ఈ మాట మళ్లీ మళ్లీ వినిపిస్తుంది. మేరీయే ఈ మాట అంటారు. వెంటనే పెద్దగా నవ్వేస్తారు.మేరీలో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతుంటుంది. ఆమె ప్రత్యేకమైన మనిషి. సహజసిద్ధ ప్రతిభానైపుణ్యాలున్న బాక్సర్. తానంటే దేవుడికి ఎంతో ప్రేమని, దేవుడి కృప వల్లే తాను నేడీ స్థాయిలో ఉన్నానని ఆమె చెబుతారు.37 ఏళ్ల మేరీ ఏడుసార్లు వరల్డ్ చాంపియన్‌షిప్‌ బంగారు పతకాలు సాధించారు. ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలుచుకున్నారు. ఒలింపిక్ పతకం గెలిచిన తొలి, ఏకైక భారతీయ మహిళా బాక్సర్ మేరీయే. ఆసియా, కామన్వెల్త్ క్రీడల్లోనూ ఆమె పసిడి పతకాలు గెలుపొందారు.ఈ పతకాల్లో అత్యధికం 2007లో సిజేరియన్ కాన్పులో కవలలకు జన్మనిచ్చిన తర్వాత సాధించినవే. అత్యున్నత స్థాయి పోటీల్లో తలపడి రాణించడానికి ఏం కావాలో, ఏం చేయాలో మేరీకి తెలుసు. తన కఠోర శ్రమే ఆమెకు ఆత్మవిశ్వాసాన్ని అందిస్తుంది.