నాయకులు ఓట్ల కోసం ఎన్నో చెబుతారు, తర్వాత మమ్మల్ని మరచిపోతారు

ఆ గ్రామాల ప్రజల చిరకాల కోరిక ఒక రోడ్డు. దానికోసం అధికారులను వారు ఎన్నోసార్లు కలిశారు. ప్రజా ప్రతినిధుల చుట్టూ తిరిగి అలసిపోయారు. ఇక ఎవరో వస్తారు... ఏదో చేస్తారని చూడకుండా 9 గ్రామాలకు చెందిన దాదాపు 200 మంది గిరిజనులు ఏకమై స్వయంగా రహదారిని నిర్మించుకుంటున్నారు. ఇప్పటికే దాదాపు 10 కిలోమీటర్ల రోడ్డు పూర్తి చేశారు.